స్థానిక’ షెడ్యూల్ రిలీజ్

స్థానిక’ షెడ్యూల్ రిలీజ్
ఐదు దశల్లో ఎన్నికలు..
మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్
తరువాతే సర్పంచ్ ఎన్నికలు
అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11వరకు నిర్వహణ
అమల్లోకి వచ్చిన కోడ్
BLN తెలుగు దినపత్రిక:, బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీలోగా మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈరోజు నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

*ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికలు*
————————-
* మొదటి దశ
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 9
పోలింగ్ తేదీ – అక్టోబర్ 23
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11

*రెండో దశ
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 13
పోలింగ్ తేదీ – అక్టోబర్ 27
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11

*సర్పంచ్ ఎన్నికలు*
————————-
* మొదటి దశ*
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 17
పోలింగ్ తేదీ – అక్టోబర్ 31
కౌంటింగ్ తేదీ – అక్టోబర్ 31

* రెండో దశ*
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 21
పోలింగ్ తేదీ – నవంబర్ 4
కౌంటింగ్ తేదీ – నవంబర్ 4

*మూడో దశ*
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 25
పోలింగ్ తేదీ – నవంబర్ 8
కౌంటింగ్ తేదీ – నవంబర్ 8


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post