బీటీ రోడ్డు పనులు ఆపింది కనిపించడం లేదా - పనులు నిలిపివేసినట్టు కాంట్రాక్టరే ఒప్పకున్నాడు కదా

- కండ్ల ముందు కనిపిస్తున్నా అవాస్తవాలు మాట్లాడడం ఎందుకు
- తప్పుడు ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ నాయకులే 
- మైలారం మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ గడిపె విజయ్ కుమార్ 
శాయంపేట: మైలారం గ్రామంలో చేపడుతున్న పెద్ద చెరువు కట్ట పనులు తాము అడ్డుకోలేదని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ గడిపె విజయ విజయ్ కుమార్ స్పందించారు. పనులు నిలిపివేసినట్టు స్వయంగా కాంట్రాక్టరే ఒప్పుకున్నా, పనులు అడ్డుకోలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. హుస్సేన్ పల్లి నుంచి మైలారం వరకు చేపడుతున్న బీటీ రోడ్డు పనులు నిలిచిపోయింది వాస్తవమని తెలిపారు. పనులు ఆగిపోయింది కండ్ల ముందు కనిపిస్తున్నా అవాస్తవాలు మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పనులు అడ్డుకోకపోతే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. రోడ్డు పనులు ఇష్టారీతిని చేపడుతున్నా ప్రశ్నించొద్దా అని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని తెలిపారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అరిజెల సునీత సాంబరెడ్డి, మాజీ సర్పంచ్ మస్కె సదయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మస్కె సుమన్, మస్కె భాస్కర్, ఒంటేరు శంకర్, గడిపె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post