బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం,హన్మకొండ జిల్లా.

హన్మకొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి  మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య 
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ...
ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాబావ పరిస్థితి చూస్తుంటే చాలా నిరాశ జనకంగా రైతులకు తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షభావ పరిస్థితులు ఉన్నాయి.
వర్షాలు పడిన పడుకున్న రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించలానే సదుద్దేశ్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచిన్నప్పటి నుండి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క నిరూపయోగమైన ప్రాజెక్ట్ గా చూపెట్టాలానే ఒక్క దురుద్దేశ్యంతో దాదాపు రెండు సంవత్సరాల నుండి పంపులను ఆన్ చెయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా చేయడానికి అహర్నిశలు పనిచేస్తునది అని చెప్పడానికి నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సమికృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది.
అసలు సమావేశం ఎందుకు జరుగుతుంది ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఉన్న నీళ్లను ఎవరికీ ఏ పద్ధతిలో ఇవ్వాలనే అధికారులు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాలకి నిన్న చూపిన గణంకాలలో ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపు లేదు.
ఎందుకంటే LMD లో నీళ్ళు లేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్ళు లేవు అని కాబట్టి మాటలు చెప్పి చేతులు దులుపుకునే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది.మీ కక్ష, మీ పట్టింపు అన్ని కూడా కెసిఆర్ గారి మీద పెట్టి ఘోష్ కమిటీ వేసి ఏకపక్షం గా నివేదిక ఇచ్చినట్టు మీ లీకులు చూస్తే అర్ధం అవుతుంది.
కానీ ఒక్క రైతుగా నేను బాధపడుతున్న,ఈ వర్షాలు చూస్తుంటే ఇప్పటికి సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు అయింది.
గోదావరి నదిలో ప్రతి రోజు లక్ష నుండి లక్షా యాభైవేల క్యూసెక్కుల నీరు వృధాగా పోయి సముద్రంలో కలిసి పోతుంది.మిమ్మల్ని రైతులు నమ్మి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, రైతు బందు రూ. 15,000/- ఇస్తారని,బోనస్ ఇస్తారని ఆశపడి ఓట్లు వేసిన పాపానికి రైతుబంధు రాం రాం చేసిండ్రు.
రుణమాఫీ కొంతమందికి ఏగొట్టిరు.
చివరకు నీళ్లు అయినా ఇస్తారని అనుకుంటే అవి కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు.
ఎందుకండీ రైతుల మీద ఇంత కక్ష.
రేవంత్ రెడ్డి అంటుంటాడు నేను రైతు బిడ్డను అని నువ్వు రైతు బిడ్డవి కాదు,రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మంత్రి అని చెప్తా ఉన్నావు కదా నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు వస్తాయి ఈ దేవాదుల యొక్క నీళ్ళు, శ్రీరామ్ సాగర్ నీళ్ళు, మానేరు నీళ్ళు కూడా నీ నియోజకవర్గానికి వస్తాయి.
అక్కడ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిన పాపానిక రైతుల మీద ఇంత కక్ష.
ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గలను సభ్య సమాజానికి తెలియ చేయాల్సిన బాధ్యత ఉంది.రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు.
రైతులను అడ్డం పెట్టుకుని కెసిఆర్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.తక్షణమే మోటార్లను ఆన్ చేయండి, మా రైతులను ఆదుకోండి, రైతుల ముఖంలో ఆందోళన లేకుండా చేయండి.రైతులకు యూరియా దొరకడం లేదు.
ఓట్లేసిన పాపానికి ఇంత కష్టపడాలన, ఇంత గోస పడాల అని ఈ రోజు రైతులు ఆందోళన పడుతున్నారు.మన జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఉంది,దాని పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు ఇరిగినవి అని డ్రామాలు చేస్తున్నారు.కేటీఆర్  డ్రామా రావు అని నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి.అసలు డ్రామాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి.
దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే పంపు హౌస్ లు ఇప్పటికి పూర్తి స్థాయిలో నడవడం లేదు.ఇన్-టేక్ - వెల్ నుండి స్టార్ అయ్యి బీమ్ ఘనపూర్ చెరువుకి వస్తే అక్కడి నుండి చలివాగు ప్రాజెక్ట్ కి, రామప్ప చెరువులోకి, స్టేషన్ గణపుర నియోజకవర్గం లోకి వస్తాయి.అక్కడి నుండి చేర్యాల వరకు వెళ్తాయి.ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మోటార్లు నడవడం లేదు.ఘన్పూర్,జనగామ, పాలకుర్తి ఇవ్వని లిఫ్ట్ ఇరిగేషన్ దేవాదుల ప్రాజెక్ట్ పై ఆధారపడి ఉన్న ప్రాంతాలు.
ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్న మీరు ఏ రోజైన సమీక్ష చేశారా.ఎన్ని నీళ్లు వస్తున్నాయి,ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని క్యూబేక్స్ ల నీళ్ళు వస్తున్నాయి, నాకు తెలిసి 73 క్యూబేక్స్ ల నీళ్ళు రావాల్సింది.కానీ ఇప్ప్పుడు భీమ్ ఘనపూర్ కి 57 క్యూబేక్స్ ల నీళ్ళు వస్తున్నాయి.ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి అంటే మోటార్లు కాలిపోయాయి,పైప్ లైన్ లేకేజీలు ఉన్నాయి అని చేప్తున్నారు.ఇవ్వని ఎప్పుడు చేసుకోవాలండి ఎండాకాలంలో నీళ్ళు లేనప్పుడు రిపేర్ చేసుకోవాలి.
కానీ పాలకులకు చిత్తశుద్ధి లేదు, ఎంత సేపు అధికారాన్ని అనుభవించాలనే కోరిక తప్ప, రైతులను ఆదుకోవాలనే చిత్త శుద్ధి లేదు.
ఇప్పటికైనా ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు.ఈ రోజు LMD లో నీళ్ళు లేకపోతే రైతుల పక్షాన మీరు ముఖ్యమంత్రి పైన తిరుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది.
మీరు కనుక రైతుల పక్షాన మాట్లాడక పోతే ప్రజలు మిమ్మల్ని గ్రామ పొలిమేరల నుండే తరిమి కొడతారు.రైతులను మీరు ఆషామాషి గా తీసుకుంటున్నారు.రైతులు నోరులేని వారు, ఏమి అడగలేరు అని, వీళ్ళకి ఏమి తెలుసు అనుకుంటున్నారు..
కానీ రైతులు మీకు తగిన ప్రాయచిత్తం చేస్తారు అని హెచ్చరిస్తున్న.తక్షణమే దేవాదుల ప్రాజెక్ట్ పై సమీక్ష ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ నాయకుల తప్పిదం వల్ల పొట్టదశలో ఉండే పొలాలు ఎండబెట్టుకుని రైతులు నష్టపోయారు.
కాబట్టి ఇప్పటికైన సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలే అంటున్నారు కమిషన్ల మీద కాలయాపన చేస్తున్నారు అని, మా ముఖ్యమంత్రి కి చేత కాదు అని అంటున్నారు.
మీరు మీ పార్టీలో ఉండే నాయకులకే సమాధానం చెప్పలేక పోతున్నారు.
కాబట్టి ఇప్పటికైన రైతుల పై రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ, రైతుల ప్రయోజనాలపై, రైతు సంక్షేమం పై పనిచేయాలని రైతుల పక్షాన కోరారు.ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్,డా. హరి రమా దేవి, దేవమ్మ, కర్ర సోమిరెడ్డి, నాగుర్ల కృష్ణమూర్తి, గుండె మల్లేష్, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post