ఆగిఉన్న లారీని తప్పించపోగా మరో లారీని డీ కోట్టిన ఆర్టిసి బస్సు11మంది కి గాయాలుఎం జి ఎం హాస్పిటల్ కు తరలింపు

BLN తెలుగు దినపత్రిక/శాయంపేట:
హన్మకొండ నుండి కాళీశ్వరం వెళుతున్న ఆర్టిసి బస్సు రోడ్డు పై పంచర్ అయిన లారిని తప్పించ పోయి ఎదురుగా వస్తున్న మరొక లారీ డీ కొట్టడంతో బస్సు లో ప్రయాణం చేస్తున్న 11 మంది కి గాయాలైన సంఘటన వివరాలు ఈ విధoగా ఉన్నాయి. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం సింగారం గ్రామం వద్ద హైవే పై ఆర్టిసి బస్సు (టిఎస్ 25 జడ్ 0045) ఆగి ఉన్న లారీ (ఏపీ 24 వై 3939)ని డీ కోట్టిoది. బస్సు లో 55 మంది ప్రయాణిస్తుండగా 11 మందికి గరిగ పోచన్న, నాగం వెంకటమ్మ,అట్లూరి భద్రయ్య,పెరక ఎలమ్మ, కుసుమ సరోజ, కుసుమ రాజయ్య, గుజ్జుల పవిత్ర, ఇటుక ఉమారాణి, ఇటుకల శశివరన్, గంప పోషక్క, గంప అమూల్య, లతో పాటు మరి కొందరి కి గాయాలు కాగా 108 వాహనం లో ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ కు క్షతగాత్రు లను తరలించినట్టు ఎస్ ఐ పరమేశ్వర్ తెలిపారు. జాతీయ రహదారి పై లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిల్చి పోయినది. ఆర్టీసీ బస్సు కంట్రోల్ చేస్తుండగా ముందు గల లారీ వెనుకాల తగిలడంతో ప్రయాణికులకు గాయాలు ఐనట్టు ఎస్ ఐ పరమేశ్వర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆగివున్న లారీ అటువంటి సైడ్ లైట్స్, సూచన బోర్డు లు పెట్టలేదని ఎస్ ఐ తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post