ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కుటుంబానికి ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు- రామ్ చందర్రావుకు- వినతి పత్రం అందించిన (టీఎస్ జెఏ) నాయకులు
అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా కొనసాగుతూ ఉచితంగా వార్తా సేవ సమాచార సేవ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి పత్రం అందించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన రామచంద్రరావుకు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల కు సంబంధించిన వినతి పత్రాన్ని అందించి అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడారు.అహర్నిశలు ఉచితంగా ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు భారమవుతున్న నేపథ్యంలో ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు రోజుకు ఉచితంగా లీటర్ పెట్రోల్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా మండల స్థాయి జర్నలిస్టుకు సైతం దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఉచితంగా రైల్వే పాసులు ఇవ్వాలని ఇంతే కాకుండా జర్నలిస్టులకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా నెలసరిగా కొంత ఆర్థిక సహకారం ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు దుస్స చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు యాతాకుల మధుసూదన్, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కొమ్మ గాని సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు బచ్చలకూరి వెంకన్న, ఆత్మకూర్ (ఎస్) అధ్యక్షుడు కొండ రవి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post