మండలానికి ఐదు ఎంపీటీసీలు ఉండాల్సిందే !

పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్ జారీ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) డీలిమిటేషన్ కు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేసింది.ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన.. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలతో కూడిన సర్క్యులర్ ను జారీ చేశారు. కొన్ని గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలో విలీనం కావడం, ఇతర పంచాయతీలలో కలపడంతో ఈ పునర్వ్యవస్థీకరణ అవసరమైంది.తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) చట్టం ప్రతీ మండల ప్రజా పరిషత్‌లో కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండాలని చెబుతోంది. ఇందులో భాగంగా ప్రభావిత ఎంపీటీసీలను కొత్త ఎంపీటీసీలుగా క్రమబద్ధీకరించడం లేదా సమీపంలోని ఎంపీటీసీలలో విలీనం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్.. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్
ముసాయిదా ప్రచురణ: 08.07.2025
అభ్యంతరాల స్వీకరణ:
08.07.2025 నుంచి 09.07.2025
అభ్యంతరాల పరిష్కారం:
10.07.2025 నుంచి 11.07.2025
తుది ప్రచురణ: 12.07.2025

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post