రైతులకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి బాబు సూచన

రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
 భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పాలం నుండి మురుగు నీటిని వీలైనంత వరకూ త్వరగా పొలం నుండి తీయవలెను.
రానున్న రెండు రోజులలో తేలికపాటి నుండి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో పురుగు మరియు కలుపు మందుల పిచికారీ, పై పాటు ఎరువులను అంధించటం మరియు పంట పెట్టుకోవడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.
భారీ వర్షాల సూచన ఉన్నందున మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
 • ఉరుములు మరియు మెరుపులతో కూడిన అధిక వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
అదేవిధంగా రైతుల చెట్ల కింద నిలబడరాదు మరియు మేకలు గొర్రెలు పశువులను కూడా చెట్ల కింద ఉంచరాదు.
 • ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకున్న రైతులు పచ్చిరొట్టు పంటలను భూమిలో కలియదున్ని దమ్ము చేసుకోవడం ప్రారంభించుకోవాలి. దుమ్ము చేసుకున్న సమయంలో ఒక 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ వేసినట్టయితే అది తొందరగా కుల్లడానికి అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులు గమనించగలరు
వరి
 • నీటి ముంపు గురి అయిన నారు మడులు మరియు వరి పొలాలు నుండి మురుగు నీటిని వెంటనే తీసివేయాలి.
 • వర్షాలు తగ్గిన తరువాత, ఇప్పటి వరకు నారు వేసుకోని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్విని వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి నేరుగా వరి వెదజల్లే పద్ధతిలో గాని లేదా డ్రం సీడర్ ద్వారా వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో వరిని వేయవలెను. దీని ద్వారా 10 నుంచి 15 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది అంతేకాకుండా 12 కిలోలు విత్తనం ఎకరానికి సరిపోతుంది.
 • నేరుగా విత్తె పద్ధతిలో స్వల్ప కాలిక సన్నగింజ రకాలను (120-125 రోజులు) ఎంచుకోవాలి.
ప్రత్తి
 • ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన ప్రత్తిలో వడ తెగులు తేలికగా ఆశించవచ్చు.
 • వర్షాలు తగ్గిన తరువాత వడ తెగులు సోకిన మొక్కల మొద్దల్ల దగ్గర 3 గ్రా. కాపర్-ఆక్సీ-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి వారం వారం వ్యవధిలో రెండుసార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీ కె ఒక కిలో ఎకరానికి లేదా 500 ml నానో యూరియా ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసినట్టే తగిన ఫలితం ఉంటుంది.బాబు, జిల్లా
వ్యవసాయ అధికారి 
 భూపాలపల్లి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post