పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించండి!

ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చి విద్యార్థులకు మొండిచేయి చూపించే కాంగ్రెస్ ప్రభుత్వం పై విద్యార్థులు పోరాడండి!పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి బట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆఫీస్ ముట్టడి
అక్రమంగా పి డి ఎస్ యూ జిల్లా నాయకులను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ తరలింపు---వంగూరి వెంకటేష్ PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు రావలసిన ఫీజుబకాయల విషయంలో స్పందించకుండా విద్యార్థులకు మొండి చేయి చూపిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విద్యార్థులు రాజీలేని పోరాటానికి సిద్ధపడాలని పి డి యస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు.పి డి యస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, 8000వేల కోట్లు బెస్ట్ అవైలబుల్ 200ల కోట్లు బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలి ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి యస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుల ఆఫీస్ ముట్టడించిన పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా బృందంన్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిండాన్ని సమాజం ఖండించాలన్నారు.
ఈ సందర్భంగా వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని వారు అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఎనిమిది వేల కోట్ల రూపాయల బెస్ట్ అవైలబుల్ రొండువందల కోట్లు ఫీజుబకాయలను చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని గత కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే నేటి రేవంత్ రెడ్డి సర్కార్ కు పడుతుందని వారు హెచ్చరించారు. 
ప్రభుత్వ కాలేజీ లో చదివివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వ విద్యాసంస్థల లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు పాస్సులు ఇవ్వాలన్నారు. నెల నెలా ప్రజాప్రతినిధులకి జీతాలు చెల్లించే ప్రభుత్వం విద్యార్థులకు ఎందుకు మొండి చేయి చూపిస్తుందని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ హయాంలో రాష్టంలో విద్యారంగా పరిస్థితి ధరణంగా ఉందిఅని చెప్పినా ఏమాత్రం పట్టింపు లేని రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన ఏవిధంగా అవుతుందని వారు అన్నారు. ఇంటర్,డిగ్రీ,ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ రాకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేకపోవడం బాధాకరమని రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేసి భవిష్యత్తులో ఎత్తివేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తుందని వారు తెలిపారు. 
నేడు విద్యావ్యవస్థ కోలుకోలేని విధంగా తయారయింది అన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగాఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు,జర్నలిస్ట్ పిల్లలకు 50 % ఫీజు లు రాయితీ ఇవ్వకుండా 
విద్యా ప్రమాణాలు పాటించకుండా సంపాదనే లక్ష్యంగా విద్యా వ్యాపారానికి పాల్పడుతూ పేద వర్గాల వద్ద అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో ఫీజులను గుంజుతూ పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బెస్ట్ అవైలబుల్ ఫీజు ల ని తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా నాయకులు వినయ్, కార్తీక్, పృథ్వి, సురేష్, నసీర్, చందు, అశోక్, ప్రసాద్, పేర్ల వెంకటేష్, narతదితరులు పాల్గొన్నారు. 
విప్లవాభివందనాలతో... వెంకటేష్ పి  డి ఎస్ యు జిల్లా కార్యదర్శి. ఖమ్మం

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post