వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి..!!జర్నలిస్టులకు తహశీల్దార్ యూనియన్ నేతల విజ్ఞప్తి

ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలి.
జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది., బ్లాక్ మెయిల్ పాల్పడే వారిపై పిర్యాదులు చేశాం..
బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి ఓ ఆన్లైన్ పత్రిక తనపైన తప్పుడు వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేసిందని అయినవోలు తహసిల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు. 
వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో వరంగల్ జిల్లా తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని, గత ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని, అయినా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నామని, ఒక ఆన్లైన్ పత్రిక వారు అసత్య రాతలు రాసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని వారిపై మాత్రమే ఫిర్యాదు చేశామని,ఎవరికైనా తమపై అనుమానాలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, కానీ ఆర్థికంగా డబ్బులు ఇస్తావా? లేదా? అని బెదిరింపులకు పాల్పడడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని* దీంతో పోలీసులు ఆశ్రయించానని విక్రమ్ కుమార్ తెలిపారు, తనకు మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని, పత్రిక విలేకరులపైన, వారి వృత్తి పట్ల అత్యంత అభిమానం, గౌరవం ఉన్నాయని అయినవోలు ఎమ్మార్వో విక్రమ్ కుమార్ తెలిపారు. కానీ బ్లాక్ మెయిల్ చేసే ఆ..జర్నలిస్ట్ లను భరించలేక మాత్రమే పోలీస్ లను ఆశ్రయించానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వరంగల్ తహాసిల్దార్ ఇక్బాల్, ఖిలావరంగల్ తహసిల్దార్ నాగేశ్వరరావు, హన్మకొండ తహసిల్దార్ రవీందర్, హసన్ పర్తి తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post