ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్

 పీకల్లోతు కష్టాల్లో పడింది. 193 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 58/4తో ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన భారత్ తడబడుతోంది.భోజన విరామ సమయానికి టీమ్ఇండియా 112/8 స్కోరుతో నిలిచింది.క్రీజులో రవీంద్ర జడేజా (17*) ఉన్నాడు. నితీశ్‌ రెడ్డి (13) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే భోజన విరామం ప్రకటించారు. భారత్ విజయానికి ఇంకా 81 పరుగులు అవసరం.ఐదో రోజు ఆటలో తొలి గంటలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ (9; 12 బంతుల్లో 2 ఫోర్లు)ని ఆర్చర్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 33 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను మొదలుపెట్టిన కేఎల్ రాహుల్‌ మరో ఆరు పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాతి ఓవర్‌లోనే వాషింగ్టన్ సుందర్ (0) ఆర్చర్‌కు రిటర్న్‌ క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజా, నితీశ్‌ రెడ్డి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. నితీశ్‌ని క్రిస్‌ వోక్స్ వెనక్కి పంపడంతో 30 పరుగుల భాగస్వామ్యానికి (90 బంతుల్లో) తెరపడింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post