చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసిన మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ చంద్రప్రకాష్

శాయంపేట, జులై 2,:BLN తెలుగు దినపత్రిక : చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి చేనేత కార్మికులకు అందజేసిన 33 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలంగాణ రాష్ట్ర కనుక మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కి, స్థానిక భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులకు బాసాని చంద్రప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా కొత్త రుణాలను మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post