యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి వెళ్లాలనే ఆతృతలో కొత్త బస్టాండ్ ఆవరణలో ఓ..మహిళాభక్తురాలు తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నారు. అందులో నగదు, బంగారం ఉన్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న పావని నాగేందర్ అనే మహిళా కానిస్టేబుల్ కు ఆ..హ్యాండ్ బ్యాగ్ దొరకింది. దానిని భద్రపరిచి, అందులో ఉన్న వివరాల సహాయంతో పోగొట్టుకున్న వారిని గుర్తించింది. ఇక దొరకదు అనుకున్న హ్యాండ్ బ్యాగ్ ను తిరిగి ఆ..భక్తులకు అందజేసి ఆదర్శంగా నిలిచింది. దీంతో అంతసేపు బోరుమంటున్న ఆ..భక్తులు ఆనందంతో ఆ..మహిళాకానిస్టేబుల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ..బ్యాగులో రూ.27 వేల రూపాయల నగదు, 6 తులాల బంగారం ఉంది. ఆదర్శవంతమైన పనితీరు కనబరిచిన వ కానిస్టేబుల్ పావని నాగేందర్ ను ప్రతిఒక్కరూ ప్రశంసించారు.*
ఆదర్శంగా నిలిచిన మహిళా కానిస్టేబుల్ పావనినాగేందర్...!!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment