- పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి..
- ఆర్టీసీలో ఎంతో పని ఒత్తిడి ఉన్నా గత 28 ఏళ్లుగా డ్రైవర్ గా అంబాల సాంబయ్య విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేయడం గొప్ప విషయం..
- భూపాలపల్లి ఆర్టీసీ బస్సు డిపోలో జరిగిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అంబాల సాంబయ్య పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటే చాలా శ్రమతో కూడుకున్నదని, ప్రతీ ఉద్యోగి సంస్థ యొక్క అభివృద్ధి కోసం విధుల్లో చేరిన నాటి నుండి అహర్నిశలు కృషి చేస్తారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన అంబాల సాంబయ్య గత 28 ఏళ్లుగా టీజీఎస్ఆర్టీసీలో బస్సు డ్రైవర్ విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఈరోజు భూపాలపల్లి లోని ఆర్టీసీ డిపోలో జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ముందుగా సాంబయ్య దంపతులకు ఎమ్మెల్యే పూలమాల వేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గణపురం మండలం కరకపల్లి గ్రామానికి చెందిన సాంబయ్య గత 28 ఏళ్లుగా ఆర్టీసీలో బస్సు డ్రైవర్ గా పనిచేసి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అధికారుల, తోటి ఉద్యోగుల మన్ననలను పొందారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని.. అయితే ఇన్ని రోజులు వారు ఎలాంటి సేవలందించారన్నది చాలా రోజుల పాటు గుర్తుంటుందన్నారు.ఆర్టీసీలో సుదీర్ఘకాలం పాటు చేయడం చాలా శ్రమతో కూడుకున్నదన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపోలో పని చేసే ఇతర సిబ్బంది శారీరక శ్రమ అంతా ఇంతా కాదన్నారు. వీరంతా ప్రతి రోజు పని చేస్తేనే ఎన్నో వేల మంది తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతారన్నారు. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సాంబయ్య ఇన్ని రోజులు పాటు చాలా కష్టపడ్డారని, ఇక నుంచి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు
Post a Comment