పరకాల లోని నర్సక్కపల్లె సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఏకు శ్రీవాణి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని బహుజన సంక్షేమ సంఘంహనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారపెళ్లి విజయ్ కుమార్ అన్నారు. ఉదయం టిఫిన్ సమయంలో శ్రీవాణి వాష్ రూమ్ కు వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం తెలుస్తుందని, ఈ ఆత్మహత్య గల కారణాలు తెలుసుకొని ఆత్మహత్య కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనివాలని అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్చుకునే సంక్షేమ పాఠశాలలో ఇలా జరగడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల పైన ఉందని వాపోయారు. ఈ సమావేశంలో పి శ్రీకాంత్ ఎన్ అనిల్ పాల్గొన్నారు..
విద్యార్థిని,ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి- బి ఎస్ ఎస్ డిమాండ్,
byBLN TELUGU NEWS
-
0
Post a Comment