తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పథకం గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట డిప్యూటీ తహసిల్దార్ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి దరఖాస్తు గడువు పెంచాలని చాలామంది పేద రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక దరఖాస్తు చేసుకోలేదని ఇంకో వారం రోజులు గడువు పెంచాలని డిప్యూటీ తహసిల్దార్ కి ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ నాయకులుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపేల్లి క్రాంతి కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సుమన్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి విజయ్ కుమార్, కిరణ్ బాను తదితరులు పాల్గొన్నారు.
బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ వినతి పత్రం అందచేత
byBLN TELUGU NEWS
-
0
Post a Comment