సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.!!. ఈరోజు ఉదయం (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా.. వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కొమ్మినేని శ్రీనివాస్‌ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.
అమరావతి మహిళలు, అమరావతి ప్రాంతంపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో సాక్షి ఛానల్‌లో నిర్వహించిన డిబేట్‌పై రాజధాని ప్రాంతం మహిళలతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన ర్యాలీలు చేపట్టారు. అనేక పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ మహిళా నాయకురాలు కంభంపాటి శిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు *నిన్న ఉదయం హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాస్‌ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరుకు తరలించిన పోలీసులు.. రాత్రి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు.* ఆపై ఈరోజు ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.ఇరువర్గాల వాదనలు విన్న మంగళగిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అతడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Post a Comment