మొట్టమొదటిసారి జోసా పద్ధతిలోనే టీజీఈఏపీలోనూ మాక్ కౌన్సిలింగ్ని నిర్వహించారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసుకున్న కళాశాలల నుంచి మొదటి సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు చేసుకోక పోతే మాక్ కౌన్సిలింగ్లో కేటాయించిన సీట్లనే ఫైనల్ చేయనున్నారు. మొత్తం 3 ఫేజ్లలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి విడత .. మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. *ఈ నెల 28 నుంచి జులై 7వ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుక్కింగ్కి అవకాశం కల్పించనున్నారు.* జులై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్లాట్ బుక్కింగ్, 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జులై 13వ తేదీ లోపు మాక్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో మార్పు లేకపోతే అవే సీట్ల కేటాయింపును ఫైనల్ చేయనున్నారు. జులై 18వ తేదీలోపు మొదటి విడత కౌన్సిలింగ్ సీట్లను కేటాయించనున్నారు.
రెండో విడత :జులై 25న రెండో ఫేజ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం కల్పించి 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 26,27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరించనున్నారు. జులై 30వ తేదీలోపు సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత విద్యార్థులు జులై 31 నుంచి ఆగస్టు 2వ తేదీల్లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అన్ని కళాశాలల నుంచి విద్యార్థుల జాయినింగ్ సమాచారం తీసుకుని మిగతా సీట్లకు ఆగస్టు 5 నుంచి స్లాట్ బుక్కింగ్ చేపట్టనున్నట్టు టీజీఈఏపీసెట్ అడ్మిషన్స్ కమిటీ ప్రకటించింది.
మూడో విడతఆగస్టు 5న మూడో విడత కౌన్సిలింగ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం ఇచ్చి 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 10వ తేదీలోపు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తైన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్కి అవకాశం కల్పించనున్నట్టు అడ్మిషన్స్ కమిటీ పేర్కొంది. ఇంటర్నల్ స్లైడింగ్కి ఆగస్టు 18,19 తేదీల్లో ఆప్షన్లను తీసుకుని ఆగస్టు 22వ తేదీలోపు సీట్లకేటాయింపును పూర్తి చేయనుంది.
Post a Comment