బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్
రాజీవ్ యువ వికాస్ పథకం అప్లికేషన్ గడువు ముగుస్తున్న తరుణంలో ఆన్లైన్ సర్వర్ డౌన్ కావడం వలన అనేకమంది ప్రజలు ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని, ఈ అప్లికేషన్ గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ అనేకమంది పేద ప్రజలు వారి పనులను పక్కకు పెట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం అప్లికేషన్ చేసుకొనుటకు ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని, సేర్వర్ డౌన్ కావడంతో ఆన్లైన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. చాలామంది ప్రజలు అప్లికేషన్ చేసుకొనుటకు ఆన్లైన్ సెంటర్లకు ఇంకా వస్తున్నారని తెలిపారు. సాంకేతిక లోపం సంబంధించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజీవ్ యువ వికాస్ పథకం అప్లికేషన్ గడువు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post a Comment