పరకాల ప్రెస్ క్లబ్ పరిధిలో గల పరకాల మండలంలో పని చేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ఇంచార్జ్ లకు తెలియజేయునది ఏమనగా !
పరకాల ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించి చాలా ఏండ్లు గడిచాయి.కొన్ని అనివార్య కారణాల వల్ల తిరిగి ఎన్నికలు నిర్వహించుకోలేక పోయాము. పాత విధానాలను పరిగణలోనికి తీసుకోకుండా నూతనంగా సభ్యత్వాలు నమోదు చేసుకొని ఎన్నికలు సజావుగా జరుపుకొనుటకు,పరకాల ప్రెస్ క్లబ్ ఎన్నికల అడ్ హక్ కమిటి ఏర్పడి ఎన్నికల ప్రక్రియ ప్రకటించింది.అడ్ హక్ కమిటి నిర్ణయించిన విధివిధానాల ప్రకారం ఈ క్రింది నిబంధనలకు లోబడి అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించింది. కావున సభ్యులు నిర్ణీత సమయంలో సభ్యత్వం నమోదు చేసుకొని / స్వీకరించి ఎన్నికల్లో పాల్గొనగలరు.
1) పరకాల మండలం / డివిజన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు వరుసగా కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. దానికి సరిపడ ఆధారాలు : అక్రిడేషన్ కార్డు లేదా సంస్థ నుండి/జిల్లా ఇంచార్జ్ నుండి గుర్తింపు కార్డు అర్హత పత్రాలు చూపించాలి. దీనితోపాటు జిరాక్స్లు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, 200/-రూ॥లు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యత్వము పొందగలరు.
2. సభ్యత్వాల స్వీకరణ తేది. 08-03-2025 శనివారం ఉదయం 10 గం||లకు అందరి సమక్షంలో ప్రారంబించబడుతుంది. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ 5 రోజులు కొనసాగి తేది. 12-03-2025 సాయంత్రం 6గం||లకు ముగుస్తుంది. తేది. 12-03-2025 బుధవారం సాయంత్రం 6 గం|| తరువాత వచ్చిన సభ్యత్వాలు స్వీకరించబడవు.
3. వరంగల్ ప్రెస్ క్లబ్ లేదా ఇతర ఏ ప్రెస్ క్లబ్ లోనైన సభ్యత్వం పొంది లేదా ఓటు వేసిన సభ్యునికి సభ్యత్వం ఇవ్వబడదు.
4. సభ్యత్వ నమోదు పక్రియ పూర్తి అయిన పిదవ తేది. 13-03-2025న పరకాల ప్రెస్ క్లబ్ ఎన్నికల అడ్ హక్ కమిటి సమావేశమై సభ్యతము, ఓటర్ లిస్టు పరిశీలించి (స్క్రూటిని చేసి) తుది ఓటర్ జాబిత ప్రకటిస్తుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది.కావున సభ్యులు సహకరించి పరకాల ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా చేరి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుకొనుటకు సహకరిస్తారని ఆశిస్తున్నాము
ఇట్లు
పరకాల ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటి
Post a Comment