తెలంగాణలో వేరు వేరు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి?

మంచిర్యాల జిల్లా:ఫిబ్రవరి 04
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈరోజు ఉదయం రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత మృతి చెందగా...మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌ లో ఎస్‌ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున తన క్వార్టర్‌లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. 
తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం. . ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post