ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ వినియోగదారులు కోట్లాది మంది ఉన్నారు. వాట్సప్ వినియోగదారుల భద్రత కోసం ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. దాంతో పాటు మరింతగా వినియోగదారులకు సులభతరంగా చేసేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇప్పటికే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, మెసేజింగ్ లో నూతన ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగా iOS వినియోగదారుల కోసం కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్ విడుదలచేయబడింది. అయితే ఈ ఫీచర్ వల్ల సులభతరంగాకాల్స్చే సుకోవచ్చును.ప్రస్తుతం వాట్సప్ కాల్ చేయడానికి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత వాట్సప్ వినియోగదారులు కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ వల్ల నెంబర్ సేవ్ చేసుకోకుండానే ఫోన్ కాల్స్ చేయవచ్చును. దీంతో వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అప్డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు మరింత సులభంగా కాల్స్ చేసుకోవచ్చును.
ఇప్పుడు ఐఓఎస్ వినియోగదారులు కాల్స్ ట్యాబ్ లోని + గుర్తు పై నొక్కితే డయల్ నెంబర్ అని ఎంపిక కనిపిస్తుంది. ఈ ఎంపిక ద్వారా మీరు ఫోన్ నెంబర్ నమోదు చేసి కాల్ చేయవచ్చును. లేదా చాట్ కూడాఅయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ త్వరలో అన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.
Post a Comment