హనుమకొండ: డాక్టర్ గాధే సుమంత్ రెడ్డిపై
హన్మకొండ భట్టుపల్లి రోడ్డులో దాడి జరిగింది. అయితే ఈ దాడిని వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. డాక్టర్ గాధే సుమంత్ రెడ్డి, ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అజిత్ మహమ్మద్ మాట్లాడుతూ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హింసాత్మక చర్య సమాజాన్ని తీవ్రంగా కదిలించిందన్నారు. దాడి చేసిన నిందితులపై చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను తమ అసోసియేషన్ కోరినట్లు చెప్పారు. అలాగే వరంగల్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు పోలీస్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని, నిందితులను కోర్టు ద్వారా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అటు సుమంత్ రెడ్డిపై జరిగిన దాడిని వర్థనపేట ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి సైతం తమ సీనియర్లు తీసుకెళ్లారని అజిత్మహమ్మద్ చెప్పారు.డాక్టర్ గాధే సుమంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్, డాక్టర్లు మాగంటి శేషు మాధవ్, అశోక్ రెడ్డి, కె మల్లేశం, భోజ, ప్రవీణ్, నరేష్ కుమార్, తదితరులు సైతం ఖండించారు.
Post a Comment