ఈవీఎంల గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయిభద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరుపై పరిశీలనఎన్నికల సంఘం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

హనుమకొండ: హనుమకొండ జిల్లా సుబేదారిలోని రెడ్‌క్రాస్ సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రపరిచే గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారుఈ సందర్భంగా ఈవీఎం గోదాంకు వేసిన సీల్స్‌ను తనిఖీ చేశారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లు, పరిసరాల నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారుఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. గోదాం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని భద్రతా సిబ్బందికి ఆదేశించారుఈ తనిఖీలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post