హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనాజీపురం చౌరస్తా వద్ద పాదయాత్ర తిరుమలగిరి వైపు వెళ్తుండగా, మల్లన్న ప్రయాణిస్తున్న టయోటా వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.దీంతో అదుపుతప్పిన టయోటా కారు ఎదురుగా వస్తున్న ఆల్ట్రోజ్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారుఅయితే, ఆల్ట్రోజ్ కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన సాయినాథ్తో పాటు ఆయన డ్రైవర్ భార్య తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారుమల్లన్న ప్రయాణిస్తున్న వాహనంలో డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్న ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తీన్మార్ మల్లన్న పాదయాత్రలో రోడ్డు ప్రమాదంలారీ ఢీకొనడంతో అదుపుతప్పిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment