శాయంపేట: మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో 2003–04 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం హనుమకొండలోని శ్రియా హోటల్లో అంగరంగ వైభవంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 22 సంవత్సరాల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార, ఉపాధి రంగాల్లో స్థిరపడిన నాటి విద్యార్థినీ విద్యార్థులంతా ఒకేచోట చేరి సందడి చేశారుఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పూల బొకేలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. విద్యార్థులంతా తమ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ప్రస్తుతం చేస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ నేపథ్యాలను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారుతరగతి గదుల్లో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి స్నేహాలను మరోసారి ఆస్వాదించారు. 22 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థుల మధ్య ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయిఅదేవిధంగా తమకు విద్యాబోధన చేసిన గురువు మామిడి శరత్‌తో పాటు మరికొంతమంది పూర్వ విద్యార్థులు మృతి చెందడంపై సంతాపం వ్యక్తం చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post a Comment