కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు!ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు19న లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ నగదు జమ.. పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలన వేగవంతం

హైదరాబాద్, నవంబర్ 11:రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
19వ తేదీన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 19వ తేదీన కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ మొత్తాన్ని జమ చేసేందుకు సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు
కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన దరఖాస్తుదారులకు సంబంధించిన పెండింగ్‌ వెరిఫికేషన్‌, ఆమోద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సీఈఓ దివ్య దేవరాజన్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలకు సంబంధిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులను ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి కార్యక్రమ వేదిక వద్ద ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ సూచించారుకొత్త పింఛన్ల మంజూరు, పంపిణీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post