వరి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలుసిద్ధి, మంగళ రకాల విత్తనాలతో పంట ఎదుగుదలపై పరిశీలన

సుమారు 150 ఎకరాల్లో ఇదే పరిస్థితి.. న్యాయం చేయాలని రైతుల విజ్ఞప్తి
శాయంపేట, నవంబర్ 1: మండలంలోని మైలారం, జోగంపల్లి, పెద్దకోడెపాక గ్రామాలకు చెందిన రైతులు విక్రమ్ ట్రేడర్స్ విత్తన దుకాణంలో కొనుగోలు చేసిన సిద్ధి, మంగళ రకాల వరి విత్తనాలను సాగు చేయగా పంట ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇటీవల విత్తన దుకాణం ఎదుట నిరసన తెలిపి వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారుఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు శ్రీధర్, లక్ష్మీప్రసన్న, గోవిందు నాయక్ రైతులతో కలిసి జోగంపల్లి శివారులోని వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారుఈ సందర్భంగా సిద్ధి, మంగళ రకాల విత్తనాలతో సాగు చేసిన వరి పంటల్లో ప్రాథమిక పరిశీలనలో కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలిపారు. వరి కంకులు వచ్చిన తర్వాత విత్తన నమూనాలను సేకరించేందుకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత విత్తన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించాలని సూచించారుసుమారు 150 ఎకరాల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొందని, పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన తమకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని శాస్త్రవేత్తలను కోరారుఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post