శాయంపేట, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా స్థానిక మత్స్యగిరి స్వామి, శ్రీ భక్త మార్కండేయ వెంకటేశ్వర స్వామి దేవాలయాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అనంతరం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూల పండుగతో ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. మహిళల ఆనందోత్సాహాల మధ్య ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
శాయంపేటలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment