ములుగులో హీరో నాని సందడి

ములుగు, సెప్టెంబర్ 29: టాలీవుడ్‌ హీరో నాని ములుగు జిల్లాలో సందడి చేశారు. తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’ సినీబృందంతో కలిసి ములుగులోని గట్టమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.అనంతరం నాని మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. సినీబృందంతో కలిసి ఆలయానికి వచ్చిన నాని కనిపించడంతో అభిమానులు, స్థానికులు ఆసక్తిగా గమనించారు.సినీ షూటింగ్‌ పనుల మధ్య నాని ములుగు–మేడారం ప్రాంతాలను సందర్శించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాని ఆలయాల సందర్శనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.ది ప్యారడైజ్‌’ చిత్రబృందం ములుగు–మేడారం పర్యటనతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. హీరో నాని రాకతో అభిమానుల్లోనూ ఉత్సాహం కనిపించింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post