ఆదర్శ గ్రామ నిర్మాత రాజమౌళి పటేల్‌కు నివాళి

వరంగల్ ఉమ్మడి జిల్లాలో పత్రికా మీడియా మిత్రులను ఉద్దేశించి తెలంగాణ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య పటేల్ మాట్లాడుతూ గీసుకొండ మండలం గంగదేవిపల్లి ఆదర్శ గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన కోసం రాజమౌళి పటేల్ మరణం తీవ్ర విషాదకరమని తెలిపారు.గంగదేవిపల్లి గ్రామంలో జన్మించిన రాజమౌళి పటేల్ గుండెపోటుతో 74 ఏళ్ల వయసులో మరణించడం గంగదేవిపల్లి గ్రామానికి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. బీసీ మున్నూరు కాపు పటేల్ వర్గానికి చెందిన రాజమౌళి పటేల్ గ్రామాభివృద్ధి కోసం చేసిన కృషి వల్లే గంగదేవిపల్లి గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు.గ్రామ అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛత, సామాజిక చైతన్యం వంటి అంశాలతో గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన రాజమౌళి పటేల్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామాన్ని సుమారు 120 దేశాల్లో ప్రదర్శించడం ఆయన సాధించిన గొప్ప విజయమని కొనియాడారు.గ్రామ అభివృద్ధి కోసం పోరాటం చేసిన ఉద్యమ నాయకుడిగా రాజమౌళి పటేల్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని కొమురయ్య పటేల్ అన్నారు. ఆయన చేసిన సేవలు గంగదేవిపల్లి గ్రామ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు రౌతు శ్రీను, ఎం. సతీష్, ఎర్రన్న, పైడి అశోక్ తదితర ఉద్యమకారులు, కళాకారులు పాల్గొని రాజమౌళి పటేల్‌కు నివాళులర్పించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post