మరో 12 రోజులు ఉండగానే శుక్రవారం మినీ మేడారం జాతరను తలపించే విధంగా భక్తులు మేడారం వైపు తరలివచ్చారు. గురువారం సాయం కాలమే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకోగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే తండోపతండాలుగా భక్తులు వివిధ రకాల వాహనాల పై ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారం చేరుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద భక్త జనం ట్రాఫిక్ జాం ఏర్పడింది. మేడారం చేరుకున్న భక్త జనం జంపన్న వాగులో పుణ్య స్థానాల ఆచరించి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అన్న తేడా లేకుండా భక్తులు దర్శనాల కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో భక్తులను కట్టడి చేయడానికి పోలీసులు నానా యాతన పడ్డారు. కాగా అమ్మవారి గద్దెల ప్రాంతంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులకు భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఆటంకం కలిగింది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి రావడంతో పనులను నిలిపివేశారు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు..
మేడారానికి పోటెత్తిన భక్తులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment