మహాత్మా జ్యోతిబా ఫూలే వెనకబడిన తరగతులు సంక్షేమ పాఠశాల బాలురు శాయంపేట లో ఈరోజు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ రేవతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పరకాల ఏసిపి సతీష్ బాబు , శాంపేట మండలం సిఐ రంజిత్ మరియు ఎస్సై పరమేశ్వర్ రావడం జరిగింది. ఏసిపీ సతీష్ బాబు గారు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రవాణా భద్రత మీద అవగాహన కల్పించారు. రవాణా నియమాలు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి పాటించవలసినటువంటి నిబంధనలను వివరించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నుండి పాఠశాలకు సంక్రాంతి సెలవులు ఉండటంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు వేసి పండగ సంబరాలను చాలా వైభవంగా జరుపుకున్నారు.
Post a Comment