ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదని విమర్శించారు.
పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలి: ప్రధాని మోదీ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment