ఇప్పటికే ఇక ఆంధ్రా, కార్పొరేషన్, దేనా, విజయా, ఓబీసీ, యూబీఐ, సిండికేట్, అలహాబాద్ వంటి ఇంకొన్ని బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, ఇండియన్ బ్యాంకుల్లోకి చేర్చింది. అలాగే ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు విలీనం దిశగా ఆ బ్యాంకుల ఆర్దిక లావాదేవీలు.. సిబ్బంది.. విలీనం ప్రతపాదనల పైన కేంద్రంలోని ఉన్నత స్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం)లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఎస్బీఐల్లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది.ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ స్థాయి సీనియర్ అధికారులు చర్చించి, ఆ తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్నస్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసింది. ఇక ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటాను ఉపసంహరించుకోవడంతో ఆ వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొనుగోలు చేసింది. ఇలా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12గా ఉంది. ఇప్పుడు తాజాగా అందుతున్న ప్రతిపాదనల మేరకు తుది నిర్ణయం జరిగితే బ్యాకింగ్ రంగంలో ఇక నాలుగు ప్రధాన బ్యాంకులు వినియోగం లో ఉండనున్నాయి. ఈ విలీనం పైన అధికారికంగా త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
కేంద్రం మరోసారి బ్యాంకుల విలీనం దిశగా కసరత్తు చేస్తోంది
byBLN TELUGU NEWS
-
0
Post a Comment