ఐనవోలు జాతరలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు

జాతరను ప్రశాంతంగా, విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు
రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖహనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే ఐనవోలు జాతరపై ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లతో కలసి అధికారులతో సమీక్షించిన మంత్రి  కొండా సురేఖ ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ అధికారులను ఆదేశించారు,శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలు లో ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఐనవోలు జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,ఆలయ కమిటీ ప్రతినిధులతో కలసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, కుడా, మున్సిపల్, మిషన్ భగీరథ, ఇతర అధికారులతో ఆయా శాఖల ఆధ్వర్యంలోవైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, భద్రత వంటి జాతరలో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు లు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఐనవోలు జాతర నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించాలన్నారు. బస్టాండ్ ఏర్పాటు చేసే చోట భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ కూడా భక్తుల కోసం తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో పారిశుధ్య నిర్వహణ ఎంతో ముఖ్యమని పంచాయతీ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే పక్కన ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించాలని సూచించారు. జాతరలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం లేకుండా ఏ చిన్న సమస్య లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. జాతరకు చిన్నపిల్లల కొరకు అంగన్వాడీ కేంద్రాలలో అందించే బాలామృతం పౌష్టికాహారాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల ఆరోగ్య సంరక్షణ కు జాతర ప్రాంగణంలో వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. జాతర లో 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలు అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జాతరలో మహిళా సంఘాలకు స్టాల్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అందులో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదనంగా బస్సుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఐనవోలు జాతర నుండి భక్తులు కొమురవెల్లి, మేడారం కు వెళ్లే అవకాశాలు ఉంటుందని, అందుకు తగినవిధంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సరైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు తగిన ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. జాతరలో అనుమానితులు, దొంగతనాలు జరగకుండా పోలీసుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు జాతరకు వస్తారని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. జాతర ఏర్పాట్లలో సంబంధిత 
శాఖల పనితీరును బట్టి ప్రోత్సహకాలతో ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళలు జాతరలో పాల్గొంటారని, వారి భద్రత నిమిత్తం మహిళా పోలీసు సిబ్బందిని పోలీస్ శాఖ కేటాయించాలన్నారు. జాతర సమీపిస్తున్న దృష్ట్యా రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఇబ్బంది లేకుండా సైడ్ బర్మ్ లతో నింపాలన్నారు. ఆర్ అండ్ బీ, పోలీస్ శాఖలు సమన్వయంతో జాతరలో బ్యారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శాశ్వత టాయిలెట్స్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని అన్నారు. జాతర ప్రాంగణంలో అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జాతర విశిష్టతను తెలియజేస్తూ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. 24 గంటల పాటు విధుల్లో ఉండే పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బందికి వారి ఆరోగ్య దృష్ట్యా మాస్కులు, భోజనం, తాగునీరు, తదితర సౌకర్యాలతో పాటు అవసరమైన వారికి వైద్య సదుపాయం కల్పించాలని అన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాతర విధులను నిర్వర్తించేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాతర విధుల్లో ఉన్న వారిని మానిటరింగ్ చేసే అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతరలో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఐనవోలు జాతరను ప్రశాంతంగా నిర్వహించే విధంగా వివిధ శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. జాతర ఏర్పాట్లు బాగుండాలని అన్నారు.సమ్మక్క జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అక్కడ అభివృద్ధి పనుల ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జోగులాంబ, కొండగట్టు, కీసర, ఇతర చారిత్రక దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేస్తుందన్నారు. ఐనవోలు జాతర ఏర్పాట్లను చాలెంజ్ గా తీసుకొని అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. 
ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు మాట్లాడుతూ ఐనవోలు జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. విఐపి దర్శనం కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. విఐపి దర్శనం కోసం రుసుమ చెల్లించిన వారికి టోకెన్లు ఇవ్వాలని సూచించారు. జాతర లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా పోలీస్ సిబ్బందిని ఎక్కువ గా కేటాయించాలని పేర్కొన్నారు. జాతరకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉన్నందున ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఆర్ అండ్ బి, పోలీసు అధికారులు సమన్వయంతో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రతి శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతర బందోబస్త్ లో పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ* జాతరలో మెరుగైన సౌకర్యాలను వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వివిధ శాఖలు ఏర్పాట్లు పూర్తిచేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. గత జాతర ఏర్పాట్లను గురించి సమీక్ష చేసి ఈ జాతర నిర్వహణలో పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ జాతర లో పది వాటర్ ట్యాంకర్లను జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని, డంపర్ బిన్లను ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణ చేపడుతామన్నారు.సమీకక్షా సమావేశం అనంతరం జాతర ఉత్సవాల పోస్టర్లను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు ఆవిష్కరించారు.అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సురేఖ, ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు లను శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖకు కలెక్టరేట్ వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.ఈ సమావేశంలో డీసీపీ అంకిత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కార్యనిర్వాహణాధికారి సుధాకర్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post