సర్పంచ్ బరిలో జవాన్ భార్య

కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఓ జవాను భార్య సర్పంచ్ గా పోటీ చేయడం సంచలనంగా మారింది. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులలో తాము కూడా బాధితుల మేనని, సమస్య పరిష్కారం కొరకు గ్రామ పెద్దలను చెప్పుకునే కొంతమంది నాయకుల దగ్గరికి వెళితే ఆ సమస్యను మరింత జటిలం చేసి తమ పబ్బం గడుపుకున్నారే తప్ప... తమకు న్యాయం జరగలేదని, మా వీధి సిసి రోడ్డు కొరకు వీధివాసులమంతా సంబంధిత వార్డ్ మెంబర్ దగ్గరికి వెళితే అవహేళనగా మాట్లాడరని... అందుకే మన పని మనమే చేసుకుందామని ఉద్దేశంతో సర్పంచ్ బరిలో నిలిచినట్లు అభ్యర్థి కాసురి మమత తెలిపారు.వివిధ పార్టీల నుండి బరిలోకి దిగిన అభ్యర్థులకు దీటుగా జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో సర్పంచ్ బరిలోకి దిగానని,తన భర్త దేశ సేవ కోసం సిఐఎస్ఎఫ్ జవానుగా సేవలు అందిస్తున్నారని,తన కోరిక మేరకు గ్రామ సేవ కోసం తాను సర్పంచ్ బరిలో నిలిచానని గ్రామస్తులంతా ఓటుతో ఆశీర్వదించి తనని గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post