తెలంగాణలో ఆర్టీసీకి అద్దె బస్సులను సమకూర్చడం ద్వారా మహిళా స్వయం సహాక సంఘాలకు ఆర్థికంగా పంట పండింది మొదటి నెలలో రూ" కోటికి పైగా ఆదాయం సమకూర్చింది, దీంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి ఇచ్చి అద్దే పొందేలా ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని రూపొందించింది....
దీనికోసం ఆ సంఘాలకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్, పొదుపు నిధులను సమకూర్చింది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లాంఛనంగా ప్రారంభించా రు. మే 20 నుంచి మహిళా సంఘాల కు చెందిన మొత్తం 154 బస్సులను నడుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి నాగిరెడ్డికి ఒక లేఖ రాశారు. మహిళా సమైక్యల ద్వారా నిర్వహించేందుకు వీలుగా మరో449 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరైన వెంటనే ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ఆమె వెల్లడించారు. మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్
Post a Comment