జయశంకర్ భూపాలపల్లి.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లా కేంద్రంలోని వివి ప్యాట్, ఈవీఎం గోదామును తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాముకు వేసిన తాళం సీల్ పరిశీలించారు. అనంతరం బందోబస్తు, తనిఖీ రిజిష్టర్ లలో సంతకాలు చేశారు.గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, పర్యవేక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని వివి ప్యాట్, ఈవీఎం గోదామును తనిఖీ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment