వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యేలిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు..
- కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తీసుకురావాలి..
- పరకాల వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు..
పరకాల/భూపాలపల్లి(శాయంపేట), 3 నవంబర్ 2025:రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఈరోజు(సోమవారం) పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యేలిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు వేరువేరుగా మీడియాతో మాట్లాడుతూ.... సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు. 8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొనుగోలు చేసేలా రైతులకు సహకరించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేలా సహకరించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించారు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు ఉన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post