హైదరాబాద్ నుండి ధాన్యం, పత్తి, మొక్క జొన్న, సోయా కొనుగోళ్లు, రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పకడ్బందీ టీము వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు. తుఫాను తీరం దాటే సమయంలో ఎక్కువ ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తూఫాను తీవ్రత తగ్గే వరకు రైతులు కోతలు కొయొద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరుబయట ఉన్న ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి దాన్యం, మొక్కజొన్న, సోయా రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పంటలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని స్పష్టం చేశారు. రైతులు పత్తి పంటను తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని,
రాబోయే మూడు రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరి పంట సాగు చేసిన రైతులు తుఫాన్ తరువాత పంట కోతలు కోయాలని కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందని, కోతలు కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సన్న వడ్ల కు బోనస్ చెల్లిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చి రైతులు మన రాష్ట్రంలో ధాన్యం అమ్మే అవకాశం ఉందని కలెక్టర్లు అప్రమత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇది చాలా క్రుషియల్ సమయమని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తుఫాను ప్రభావం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారుసోమవారం జిల్లా కలెక్టర్ ఐడిఓసి కార్యాలయంలో దాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు మరియు తుఫాను ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శల్ తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రామకృష్ణా రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.అనంతరం రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ, సహకార, డిఆర్డీఓ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాను ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 1.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే, నవంబర్ మొదటి వారం నుండి ధాన్యం మార్కెట్‌లోకి రావచ్చని అంచనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్నద్దంగా ఉండాలని తెలిపారు.వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావం ఉన్నందున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాగే ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ అధికారి
ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాలకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment