హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను బు ధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం కావడంతో పలు చోట్ల క ళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యం లో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీ ఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో నూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.
మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ డం, హైదరాబాద్ సహా ఇతర జి ల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండ డంతో అన్ని శాఖల అధికారులు, సి బ్బంది అప్రమత్తంగా ఉండాలని సీ ఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ హబూబాబాద్ జిల్లా డోర్నకల్ జం క్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రా తిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్ ప్రెస్‌లు నిలిచిపోవడం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దా రి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణి కులకు ఎటువంటి ఇబ్బందులు లే కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యాలని సీఎం ఆదేశించారు.మొంథా తుపాన్ ప్రభావం అధి కం గా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎ న్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వ యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గద ర్శకత్వం వహించాలని సీఎం సూ చించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికా రులు అప్రమత్తంగా ఉండాలని, లో తట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాల ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదే శించారు.నీటి పారుదల శాఖ అధికారులు, సి బ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చె రువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాల న్నారు.పోలీసులు, రెవెన్యూ అధికా రులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాల ని సీఎం ఆదేశించారు.
తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమి కీటకాలు విజృంభించి అంటువ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం సూచిం చారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచు కోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీ ఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆ స్తి నష్టం, పశు నష్టం చోటుచేసు కో కుండా జాగ్రత్తలు వహించాలని సీ ఎం సూచించారు. రెవెన్యూ, విద్యు త్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమ న్వయంతో సాగాలని సీఎం సూ చించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీ హెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అ గ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Post a Comment