
శాయంపేట, BLN తెలుగు దినపత్రిక అక్టోబర్ 27, : మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘానికి వివిధ రకాలైన స్కీముల ద్వారా వచ్చిన నిధులను పాలకవర్గం దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని చేనేత సంఘ కార్మికులు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కు మరియు జోలి శాఖ ఏడికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘానికి వివిధ స్కీముల ద్వారా నిధులు వచ్చాయని వాటిని పాలకవర్గం దుర్వినియోగం చేసిందని అలాగే డిసిసిబి బ్యాంక్ హనుమకొండ ద్వారా కార్మికులకు 20 లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని వాటిని కూడా పాలకవర్గం దుర్వినియోగం చేశారని, డిసిసిబి బ్యాంకు నుండి 30 లక్షల రూపాయలు అప్పుగా తెచ్చారని అట్టి రూపాయలను సంఘ అభివృద్ధి కోసం వాడాలని పాలకవర్గం వాటిని కూడా దుర్వినియోగం చేసిందని, డయింగ్ మిషన్ కు వినియోగించాల్సిన రెండు లక్షల 50 వేల రూపాయలను కూడా దుర్వినియోగం చేశారని సంఘానికి సంబంధించిన ఐరన్. సామానులు అమ్మగా 60 వేల రూపాయలు వచ్చాయని కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో ట్రైనింగ్ అధికారులు 48 వేల రూపాయలను మగ్గం పరికరాల కోసం ఇవ్వగా వాటిని కూడా పాలకవర్గం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. సంఘానికి సంబంధించిన నాలుగు ఎకరాల రాగడి భూమి కౌలుకి ఇవ్వగా దాదాపుగా రెండు లక్షల 50వేల రూపాయలు వచ్చాయని, నాలుగు లక్షల 50 వేల రూపాయలు పావుల బిత్తి ద్వారా వచ్చాయని శాయంపేట ఎస్బిఐ బ్యాంక్ నుండి 30 లక్షల రూపాయలకు గాను 1,50,000 రూపాయలు మిర్చి ద్వారా రాగా అట్టి డబ్బులు కూడా దుర్వినియోగం చేశారని అంతేకాక ప్రస్తుత పాలకవర్గ కమిటీ వచ్చినప్పటినుండి నూనె సబ్సిడీ, ప్రభుత్వం ద్వారా నేటి వరకు వచ్చిన గ్రాంట్ల దుర్వినియోగంపై కూడా విచారణ జరపాలని, సంఘంలో మిగులు నూలు దాదాపు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని వీటి అన్నిటిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిధుల దుర్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్లు కోరారు. నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామని తెలిపారని కార్మిక నాయకులు అన్నారు.
Post a Comment