గ్రామీణ భారతదేశం అభివృద్ధికి మూలాధారం గ్రామ సభలు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామసభకు చట్టబద్ధమైన సవరణ రూపమిచ్చారు. ఆర్టికల్ 243ఎ ప్రకారం గ్రామ అభివృద్ధి పథకాలు, నిధుల వినియోగంపై గ్రామసభకు నిర్ణయాధికారముంది. గ్రామ ప్రజల అవసరాలు, సమస్యలు, అభివృద్ధి ప్రణాళి కలు అన్నీ ప్రజలే నిర్ణయించుకునే వేదికే గ్రామ సభ. నిజమైన ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవడం కాదు.
నిత్యం పాలనలో ప్రజల పాత్ర ఉండాలి. ప్రతి గ్రామానికి చెందిన పద్దెనిమిది ఏళ్లు పైబడిన ఓటర్లందరూ గ్రామ సభ సభ్యులే. ప్రభుత్వ పథకాలు, నిధులు ఎలా వినియోగించాలి అనే నిర్ణయాన్ని గ్రామసభ తీసుకోవాలి. అవినీతి నిరోధానికి, పారదర్శకతకు గ్రామసభ ఒక సాధనం. వార్షిక బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు, పేదల ఎంపిక వంటి అంశాలు గ్రామ సభలోనే నిర్ణయించాలి. అయితే గత కొన్నేళ్లుగా గ్రామ సభల ప్రాధాన్యత తగ్గిపోయి, వాటిని కేవలం ప్రభు త్వ పథకాల ప్రదర్శన, పన్నుల ప్రచారం, ప్రత్యేకించి జీఎస్టీ లాంటి ఆర్థిక విధానాల ప్రమోషన్‌కు వేదికగా మారుస్తున్నారు.
జీఎస్టీ గురించి గ్రామాల్లో అవగాహన కల్పించడం ముఖ్యమే కానీ, అది గ్రామ సభ ప్రధాన ఉద్దేశం కారాదు.గ్రామ సభలో కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారం కన్నా జీఎస్టీ గణాంకాలు, కాగితాలు చదివే ప్రచార ఆర్భాటంగా మారిపోతుంది. గ్రామ సభలో ముఖ్యంగా మొదట ప్రజా అవసరాలైన తాగునీరు, రహదారులు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై చర్చించాల్సిన అవసరముంది. జీఎస్టీ డిజిటల్ పేమెంట్స్, పన్ను అవగావహన వంటివి ప్రత్యేక శిక్షణ శిబిరాల రూపంలో ఉండాలి. గ్రామ సభను నిజమైన ప్రజాస్వామ్య పాఠశాలగా మార్చాలి. ప్రజల భాగస్వామ్యం, పారదర్శనక, నిధుల సక్రమ వినియోగం, సమానత్వం, అహింసా భావన ఉన్నప్పుడు మాత్రమే గ్రామ సభలు స్వరాజ్యం దిశగా నడుస్తాయి.
ఆర్టీఐ చట్టంపై అవగాహన అవసరం
సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా సమాచారం హక్కు చట్టం ఎలా అమల్లోకి వచ్చింది, చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలు తెలియాల్సిన అవసరముంది. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగ విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశ భద్రత, రహస్య సమాచారం, ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా మిగిలిన అంశాలు కచ్చితంగా ఇవ్వాల్సిందే.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాల్సిన అవసరముంది. అంతేకాదు పౌరులు ఎవరైనా ఆర్టీఐకి దరఖాస్తు చేసు కుంటే అందుకు సంబంధించిన సమాచారం 30 రోజుల్లోగా సమాధానం రూపంలో ఇవ్వాలి. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలి.
Post a Comment