వైభవంగా నాగుల పంచమి వేడుకలు

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించినారు. శ్రావణమాసం పురస్కరించుకొని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నాగదేవతల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు పుట్టలో పాలు పోసి వెండి నాగమయ ప్రతిమను వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసినారు. భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో భాషని రమేష్ ధనలక్ష్మి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post