ఆడమంటారు మరొకరు ఆడతారని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటి కాదు చాలా తప్పులు చేశారని... అన్నిటికి శిక్ష తప్పదని వార్నింగ్* ఇచ్చారు. కేసీఆర్ దగ్గర దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారని.. *ఆ దెయ్యాలు ఎవరో కవితనే చెప్పాలని* అన్నారు. దేవుడు, దెయ్యాలు అంటున్న కవిత నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. *కవిత నోరు విప్పాలని.. ఆమె ఏం చెబుతుందో వినాలని తాము కూడా చూస్తున్నామని* చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కి బీజేపీతో బంధం ఉందని కవిత స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. *మాజీమంత్రి కేటీఆర్‌కు ఈడీ అంటే ఉత్సాహం ఎక్కువగా ఉందని* మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈడీ అధికారులు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని... వారు తన ఇంటికి ఎందుకు రావట్లేదో.. కేటీఆర్ అడిగితే బాగుంటుందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్‌కు దోస్తానా ఉందని ఆరోపించారు. కవితనే ఆ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. *ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. కానీ అర్ధరాత్రయినా రాహుల్‌గాంధీని కలిసే చనువు రేవంత్‌రెడ్డికి ఉందని* స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. *గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని* మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. *కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎవరిని పిలవాలో తమ ప్రభుత్వం చెప్పదని* తేల్చిచెప్పారు. *ప్రభుత్వమే చెప్పేది ఉంటే కేసీఆర్‌నే ముందు పిలవాలని చెప్పేవాళ్లమని* అన్నారు. కాళేశ్వరంలో ఎల్ అండ్ టీ కంపెనీ కూడా ముద్దాయిగా ఉందని చెప్పారు. *తప్పు చేసి దొరికి కూడా తండ్రి, కొడుకులు(కేసీఆర్, కేటీఆర్) దబాయిస్తున్నారని* ధ్వజమెత్తారు. *కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పుచేసిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని* మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని కొట్టిపారేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment