టీచర్ ఎమ్మెల్సీలో పులి సరోత్తం రెడ్డి గెలిపించాలని ప్రచారం

శాయంపేట మండల కేంద్రంలో వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా శాయంపేట బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్స్ ను కలిసి కరపత్రం అందించి టీచర్స్ ఎమ్మెల్సీ లో బిజెపి బలపరిచిన అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పులి సరోత్తం రెడ్డి  ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాల అనుభవం ఉంది SGT, SA, PGHM గా పనిచేసి అందరి ఆధార అభిమానాలు సొంతం చేసుకున్నారు 20 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ సంఘాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో సేవలందించారు తెలంగాణ ఉద్యమంలో TTJAC బాధ్యతలు చేపట్టి సకల జనుల సమ్మెలో 32 రోజులు వేలాది ఉపాధ్యాయులతో ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో కోర్టు కేసులు ఎదుర్కొన్నారు CPS రద్దు జీవో 317, పిఆర్సి సహ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడారు అదేవిధంగా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్ మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలో అమలు చేస్తాను ఉన్న హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేసింది నియామకాలు చేపట్టక నిరుద్యోగులు ఉసురుపోసుకున్న గత టిఆర్ఎస్ పాలన బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తుందని ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ నీటి మీద రాత గానే మారింది యువతకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ బూటకమైంది మహిళలకు 2500 రూపాయలు ఆర్థిక సాయం పత్తా లేకుండా పోయింది కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న వాగ్దానం గాల్లో కలిసిపోయింది గత ప్రభుత్వ కాలంలో నియామక ప్రక్రియకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ గా మార్చి చేయని పనులను చేసినట్టు ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు నిర్ణీత గడువులోగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామన్న హామీ మర్చిపోయారని 7500 కోట్ల ఫీజులు సిమెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు టీచర్స్ సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ బాసాని విద్యాసాగర్, ఉప్పు రాజు ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post