నిరుద్యోగ సమస్యలపై ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు..ఈ సందర్భంగా నర్సంపేట పట్టణ బిఆర్ఎస్వి అధ్యక్షులు దేవోజు హేమంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని..మొదటి 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..నేటికీ 20 నెలలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.
యూత్ డిక్లరేషన్ లో 5 అంశాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని..మహిళ స్టూడెంట్స్ కి స్కూటీలు ఇస్తామని..యువ వికాసం పేరిట విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అందజేస్తాం అని అనేక రకాలు హామీలు ఇచ్చి యువతను మోసం చేశారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పబోతుంది..యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRSV నిలదీస్తూనే ఉంటుంది అని అన్నారు..
Post a Comment